2014లో రెండు రాష్ట్రాల ఎన్నికలు
– తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోంది
– అభ్యంతరాలు చెప్పుకొనేందుకే ఆంటోని కమిటీ
హైదరాబాద్, ఆగస్టు 25(జనంసాక్షి):
2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాలలో జరుగు తాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి కె.జానారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో కూడిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని, హైదరాబాద్‌ను యూటీ చేసే అవకాశం లేదని ఈయన అన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామంలో ప్రైవేటు కంపెనీ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విభజన ప్రక్రియ ఆరంభమైందని సీపీఎం మినహా అన్ని పార్టీలు విభజనకు ఒప్పుకున్నాయని తెలిపారు. ఆంటోని కమిటీ కేవలం సీమాధ్రుల అభ్యంతరాలను మాత్రమే పరిశీలిస్తుందని ఈ కమిటీకి విభజన ప్రక్రియతో సంబంధం లేదని అన్నారు. ఇరు ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని పేర్కొన్నారు. ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేంత వరకు సీఎం పదవి గురించి ఆలోచించడం సబబు రాదని అన్నారు.