-2017 ఏప్రిల్ 13న ప్రకటించిన సీఎం…. -ఐదేళ్లవుతున్నా అమలు కాని హామీ.

రైతులకు భారంగా పెట్టుబడి ఖర్చు…

-ఉ

భూక్యా చంద్ నాయక్..
జనగామ కలెక్టరేట్ జూలై 7(జనం సాక్షి): ఉచిత ఎరువుల హామీ వుట్టి మాటేనా సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని రైతులపై పెట్టుబడి భారం తగ్గించే విధంగా ఉచిత ఎరువులను పంపిణీ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భూక్య చందు నాయక్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఎరువుల ధరలను కంపెనీలు అమాంతం పెంచేశాయని, కేంద్రం కూడా సబ్సిడీపై నామ మాత్రంగానే వీటిని అందిస్తోందని, దీంతో అన్న దాతలకు ఎరువులు భారంగా మారుతున్నాయని వాపోయారు.క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లకు కలుపుకుని సుమారు 33 లక్షల టన్నుల ఎరువులు వినియోగమవుతున్నాయని అన్నారు. ఇందులో కేవలం ఒక్క వానాకాలంలోనే 26 లక్షల టన్నుల ఎరువులను రైతులు వాడుతున్నారని, రెండు సీజన్ల ఎరువు ఖర్చు రూ. 8వేల కోట్లు దాటుతున్నట్లుతెలుస్తోందని తెలిపారు. పత్తికి ఒక్క ఎకరాకు రూ.7,500 నుంచి రూ.8వేలు, వరి కి రూ. 6వేలకు పైగా ఖర్చు అవుతుందని,ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ సంస్థ రాష్ట్రంలో ఉన్నటువంటి సొసైటీలు ముందస్తుగా ఎరువుల కొనుగోలుకు నగదు చెల్లిస్తేనే సర్కారు సొసైటీ “లకు సరిపడా ఎరువులను పంపిణీ చేస్తామని విధానపరమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతులకు సరిపడా ఎరువులను సకాలంలో సొసైటీల ద్వారా అందించాలని, మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లి తీసుకురావాల్సి వస్తోందని,తద్వారా ట్రాన్స్ పోర్ట్ ఖర్చు మరింత భారంగా మారుతుంది అదే విధంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమల్లోకి తీసుకురావాలని,రాష్ట్రంలో 55 లక్షల మందికి పైగా రైతులున్నరాన్నారు. యూరియా, డీఏపీ, అమోనియం ఇలా 26 లక్షల టన్నుల వరకు వాడుతున్నారని, వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి వీటన్నింటినీ వంద శాతం ఉచితంగా సరఫరా చేస్తామని,ఆరు నూరైనా అమలు చేసి చూపిస్తాం అని అన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

చిత ఎరువులహామీ ఉట్టి మాటేనా