22న గవర్నర్‌ రోశయ్య సాలూరు రాక

విజయనగరం, జూలై 20 : జిల్లాలోని సాలూరు కన్యకాపరమేశ్వరి ఆలయ స్వర్ణోత్సవాలలో పాల్గొనేందుకు తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య రానున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఆయన వస్తున్న దృష్ట్యా కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య, ఎస్పీ కార్తికేయ శుక్రవారం నాడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ కమిటీ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా ఉండగా వచ్చే నెలలో జిల్లాకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రానున్నట్లు సమాచారం.