మూడో వికెట్ కోల్పోయిన భారత్ ,221 పరుగుల వద్ద ఔటైన క్రికెట్ దేవుడు
ముంబయి : భారత్ ,విండీస్ జట్ల మధ్య జరుగుతున్న ముంబయి టెస్ట్‌లో 221 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. సచిన్ 74 పరుగులు చేసి జౌటయ్యాడు. దీంతో సచిన్ చివరి టెస్ట్‌లో సెంచరీని చేస్తాడని దానిని కళ్లారా చూద్దామని ఎంతో ఆశగా ఎదురుచూసిన కోట్లాది క్రికెట్ ప్రేమికులకు నిరాశే ఎదురైంది. తన చివరి టెస్ట్‌లో సెంచరీ సాధించి తన హోం గ్రౌండ్‌లో ఘనంగా వీడ్కోలు తీసుకుందామనుకున్న సచిన్ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. దీంతో కోట్లాది క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు.