23న తెలంగాణ విద్రోహ దినం : జేఏసీ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. 23న తెలంగాణ విద్రోహదినంగా పాటిస్తామని జేఏసీ తెలిపింది. 26న తెలంగాణ పది జిల్లాల్లోని మండల కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటూతూ దీక్షా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొంది. 27న ఇందిరాపార్క్ దగ్గర దీక్ష ఉంటుందని జేఏసీ ఛైర్మన్ కోదండరాం చెప్పారు. 2న ఆయా పార్టీలు చెప్పే అభిప్రాయాలను బట్టి 29న జేఏసీ కార్యచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. 22న జరిగే ధూంధాం దశాబ్ధి ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. అఖిలపక్ష సమావేశం అధికార, ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణపై తేల్చి చెప్పెందుకు ఒక మంచి అవకాశమన్నారు. టీడీపీ , వైఎస్‌ఆర్‌సీపీలు తెలంగాణ ఏర్పాటుకు సానుకూల నిర్ణయం తీసుకొనేల కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని కోదండరాం చెప్పారు.