ఎన్.హెచ్.ఎం.స్కీంలో కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ అల్ క్యాడర్స్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

వరంగల్ బ్యూరో, సెప్టెంబర్ 02 (జనం సాక్షి)  శనివారంరోజున హనుమకొండ వరంగల్ జిల్లా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా ఏకశిలా పార్క్ ముందు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు నిరసన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఎన్.హెచ్.ఎం.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పి 9 సంవత్సరాలు కాలం పూర్తవుతున్న ఒక్క ఉద్యోగుని కూడా పెర్మనెంట్ చేయలేదని అన్నారు సుమారుగా 15,000 మంది ఉద్యోగులు గత 20 సంవత్సరాలు నుండి పనిచేస్తూ చాలీచాలని వేతనాలు తీసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు వైద్యం అందించడంలో వారి ప్రాణాలను కాపాడడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినట్టు ఎన్.హెచ్.ఎం.స్కీం లో పనిచేస్తున్న ఉద్యోగులందరని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని , హెల్త్ ఇన్సూరెన్స్ పది లక్షలు కల్పించాలని , మరణించిన వారికి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని , ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ చెన్నకేశవలు , హనుమకొండ జిల్లా ప్రెసిడెంట్ విష్ణు మూర్తి , ప్రధాన కార్యదర్శి శ్రీబాద్రి వేణు , జీ.సరితా , సుజాత , మంజుల , ప్రవీణ్ నూకల అంజయ్య సంతోష్ జ్యోతి , వేంకేటేశ్వరలు , ఉష ప్రియా , శ్రీనివాస్ బాబు స్వీత ఓ.సందీప్ కుమార్ స్వప్న అభిషేక్ రామనాధం కొర్నాల్ , ప్రభాకర్ , మాధవ్ రావు , క్రాంతి , విజయ్ నాయక్ , వరుణా దిలీప్ కుమార్ , వీ.రాజేష్ , రాకేష్ , సాగర్ , సతీష్ కుమార్ తోపాటు తదితరులు పాల్గొన్నారు..*