మైనార్టీ గురుకుల పాఠశాలలో మిగిలిన సీట్లకోసం మరో అవకాశం

ఎల్లారెడ్డి 12 సెప్టెంబర్ జనంసాక్షి(రూరల్)
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో 7వ తరగతిలో ఎస్టీ విద్యార్థి కొరకు 1 సీటు, 5వ తరగతిలో ఎస్సీ విద్యార్థికి 1 సీటు ఖాళీగా ఉన్నాయని, అదేవిధంగా 5,6,7,8,9 తరగతులలో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థుల కోసం పరిమిత సీట్లు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ పద్మ సుధాకర్ తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 16వ తారీఖు లోపు గురుకుల పాఠశాలలో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 

తాజావార్తలు