నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా-నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తూడి మేఘారెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్13( జనం సాక్షి)తనను నమ్ముకుని ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి కష్టాలను సమస్యలను పరిష్కరించేందుకు ఎంతవరకైనా వెళ్తానని వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు తూడి మేఘారెడ్డి గారు అన్నారు.బుధవారం వనపర్తి లో గల తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గ పరిధిలోని కొందరు సర్పంచులను అధికారులు టార్గెట్ చేస్తూ సస్పెన్షన్లకు గురిచేస్తున్నారని వారికోసం ఎంతవరకైనా వెళ్లేందుకు తను సిద్ధంగా ఉన్నానని భరోసా కల్పించారు.స్మశానవాటికలు పల్లె ప్రగతి వనాలు సెక్రిగేషన్ షెడ్లు రైతు వేదికలు లాంటి ఎన్నో ప్రభుత్వ పథకాలను రాత్రికి రాత్రి జీవోలు తీసుకువచ్చి ఉదయం వరకు గ్రామాలలో కార్యక్రమాలు చేపట్టాలని లేదంటే సస్పెన్షన్కు గురిచేస్తానని ఆనాడు బెదిరించి పనులు చేయించిన అధికారులు నేడు అదే సర్పంచ్లను బాధ్యులుగా చిత్రీకరిస్తూ వారిపై సస్పెన్షన్ వేటువేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వ పథకాల అమలులో గ్రామస్థాయిలోని ప్రజాప్రతినిధులు తమ భార్య పిల్లల బంగారు నగలు తాకట్టు పెట్టి పనులు చే

తాజావార్తలు