దొడ్డి కొమురయ్య విగ్రహ నిర్మాణ ప్రతిష్ఠకు దాతల విరాళాలు

-దొడ్డి కొమురయ్య విగ్రహ దాతగా సూర్న శ్రీశైలం

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 15 : చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహ నిర్మాణానికి దాతలు ముందుకొస్తున్నారు. శుక్రవారం విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు బింగి చంద్రం ఆధ్వర్యంలో దాతలను సంప్రదించారు. దొడ్డి కొమురయ్య విగ్రహ నిర్మాణ ప్రతిష్ఠకు గ్రామానికి చెందిన సూర్న శ్రీశైలం విగ్రహ దాతగా ముందు కొచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహ గద్దెకు ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించిన వీరన్నపేట ఎంపీటీసీ ఎలికట్టే శివశంకర్ గౌడ్, కీసర నర్సింహులు, పొన్నబోయిన గణేష్, శేవళ్ళ లింగం, శెట్టె ఐలయ్య, మీస ఆంజనేయులు, పలువురు విరాళాలు అందించారు. విగ్రహానికి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికీ కురుమ సంఘం నాయకులు విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి గౌండ్ల సాయిబాబా, ప్రధాన కార్యదర్శి గౌండ్ల శ్రీనివాస్, మేక రమేష్, చిగుళ్ల కరుణాకర్, రాసూరి పోచయ్య, సింహ చంద్రం, బైర లింగం, గౌండ్ల రామస్వామి, గౌండ్ల శ్రీశైలం, చిగుళ్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు