పార్టీ మారిన12మంది ఎమ్మెల్యేను చిత్తుగా ఓడించాలి.

టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ విజయమే లక్ష్యం.
విజయభేరి సభను విజయవంతం చేయండి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దే విజయం.
చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి,మాజీ మంత్రి చిన్నారెడ్డి.
తాండూర్ సెప్టెంబర్ 15( జనంసాక్షి)కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మాజీ మంత్రి మంత్రి చిన్నారెడ్డి లు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టి పి సి సి రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ విజయభేరి సభ ఇన్చార్జ్ సత్యనారాయణ రెడ్డి లతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. తాండూర్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈనెల 17న హైదరాబాద్లోని తుక్కుగూడ లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 70 నుండి 80 సీట్లను కాంగ్రెస్ పార్టీ సాధించి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విజయ భేరి సభకు తాండూర్ ప్రాంతం నుండి పదివేల మంది తరలిరావాలని ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సభకు తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గేలు విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పెద్దేముల్ జడ్పిటిసి ధారాసింగ్, నాయకులు ఉత్తమ్ చంద్, జనార్దన్ రెడ్డి, మహమ్మద్ అలీం, ఫ్లోర్ లీడర్ మధుబాల ,కౌన్సిలర్ మధులత పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, తదితరులు పాల్గొన్నారు.