అకత పాలకులు నల్గొండ పట్టణాన్ని పట్టించుకోలేదు

సీఎం కేసీఆర్  చొరవ తో నల్గొండ పట్టణం సర్వతోముఖాభివృద్ధి
 రూ 5000 కోట్లతో సమగ్ర అభివృద్ధి
 ఎమ్మెల్యే కంచర్ల
 నల్గొండ బ్యూరో, జనం సాక్షి.
  20 సంవత్సరాలుగా గత బలగులు నల్గొండ పట్టణాన్ని పట్టించుకోకపోవడంతో అన్ని రంగాల్లో వెనుకబడిందని సీఎం కేసీఆర్ చొరవతో పట్టణం  సర్వతోముఖాభివృద్ధి  చెందిందని  నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.
 బుధవారం  పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే బిటి రహదారుల మరమ్మత్తులు, మరియు  రోడ్డు వెడల్పు కార్యక్రమాలకు మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తో  కలిసి  కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వాహనదారులకు ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారిన చంద్రగిరి విలాస్ నుండి బాదగూడ బిటి రోడ్డు మరమ్మతు  పనులను చంద్రగిరి విలాస్ వద్ద భూమి పూజ చేసి  ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 1.14 కోట్ల రూపాయల వ్యయం తో బీటి రోడ్డు బాధగూడెం వరకు పూర్తికానుందని అన్నారు.
 అదేవిధంగా నల్గొండ పట్టణం 7,వ వార్డు సాయి నగర్ నుండి, ముషంపల్లి  వరకు డబల్ రోడ్డు నిర్మాణము, ఆర్ అండ్ బి శాఖ 1.70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న  పనులను ప్రారంభించారు. చాలాకాలం నుండి బాధ గూడెం రోడ్డు లో ప్రయాణికులు వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు బాధగూడెం వరకు బీటీ రోడ్ పూర్తవుతుందని, తాళ్ల బావి గూడెం ఒకటిన్నర కిలోమీటర్లు కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు.
 అనంతరం ముషంపల్లి రోడ్డు పనులను ప్రారంభిస్తూ దేవరకొండ రోడ్డు  ప్రాంతం అభివృద్ధిలో దూసుకెళ్తుందని, ఇక్కడే బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేశామని, ఈ ప్రాంతంలోని ఎస్ఎల్బి సి వద్ద 115 కోట్లతో మెడికల్ కళాశాల సుందరంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. జూనియర్ కాలేజీ పక్కన రైతు బజార్ ఏర్పాటు చేశామని, అక్కడే బస్తీ దవాఖానాకు స్థలాన్ని కేటాయించామని పేర్కొన్నారు.ప్రస్తుతం నల్లగొండ మండలంలోని ముషంపల్లి వరకు రోడ్డు ఇరుకుగ ఉండి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని,సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చయ్యే రోడ్డు వెడల్పు పనులు ముషంపల్లి వరకు  వరకు పూర్తి చేస్తామని ఈ ప్రాంత వాసుల ఇబ్బందులు తొలగిస్తామని తెలియజేశారు.
 మరి ఈ పనులన్నీ పూర్తి కావాలంటే కెసిఆర్ ప్రభుత్వమే మళ్ళీ రావాలని, శాసనసభ్యుగా తనకు మళ్ళీ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు బొర్ర సుధాకర్, దత్త గణేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్  అభిమన్య శ్రీనివాస్, కౌన్సిలర్లు జేరిపోతుల అశ్విని  భాస్కర్ గౌడ్, మారగోని గణేష్ సింగిల్ విండో చైర్మన్ నాగరత్నం రాజు, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు బకరం వెంకన్న, మండల పార్టీ కార్యదర్శి బడుపుల శంకర్  సర్పంచులు.. అన్నారెడ్డి గూడెం  వెంకట్ రెడ్డి, ముషంపల్లి బి వెంకటరెడ్డి, వెలుగు పల్లి ఈ శైలజ లక్ష్మారెడ్డి .మాజీ కౌన్సిలర్లు ఈరటి బాలరాజు, జయ ప్రకాష్, నాయకులు దొడ్డి రమేష్ కుందూరి ప్రవీణ్ అంజిబాబు వజ్జ శ్రీనివాస్ సయ్యద్ ముదస్సర్ జాన్ రెడ్డి, గోపాల్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు