బిజెపి నాయకులు ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

     (మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి)దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింత కుంట మండల కేంద్రానికి చెందిన బిజెపి పార్టీ నాయకులు కృష్ణయ్య యాదవ్ , నాగులు యాదవ్ , సురేందర్ యాదవ్ , హనుమంతు యాదవ్ ,  రఘు యాదవ్ల , క్ష్మన్నయాదవ్ రాములు యాదవ్. నరేందర్ యాదవ్. చిట్టెమ్మ హోటల్ మధు యాదవ్ , నాయకులు, కార్యకర్తలు శుక్రవారం   ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై కాంగ్రెస్ బిజెపి పార్టీల నాయకులు వి ఆర్ ఎస్ లో చేరుతున్నారన్నారు . సీఎం కేసీఆర్ సహకారంతో దేవరకద్ర నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని , మరోసారి ప్రజలు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన కోరారు . ఈ కార్యక్రమంలో నాయకులు ,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు . 2.50 లక్షల ఎల్ ఓ సి చెక్కుల బాధిత కుటుంబానికి అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
కౌకుంట్ల మండలం ఇసురంపల్లి గ్రామానికి చెందిన వినోద్ కుమార్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నడని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి  నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం వినోద్ కుమార్ కు ముఖ్యమంత్రి సహాయని కింద 2.50 లక్షల రూపాయలు మంజూరు చేయించి చెక్కులు శుక్రవారం వాయిదా కుటుంబానికి అందజేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేక అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిది ఒక వరం లాంటిదని అన్నారు .