భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం నిర్వహించండి.
తాండూరు సెప్టెంబర్ 21(జనంసాక్షి)భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం నిర్వహించాలని భూకైలాస్ వ్యవస్థాపకులు వాసుపవర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు కోట్ల దేవతలకు అధిపతి విగ్నేశ్వరుడని తెలిపారు విగ్నేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అంతా విజయమే ప్రాప్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా రాత్రి సమయంలో వినాయక నిమజ్జనం చేయడం అత్యంత పాపమని చెప్పారు.బాలగంగాధర్ తిలకు పూణే లోపల వినాయకుని ప్రతిష్టాపించి దేశానికి భక్తి సందేశం అందజేశారు అయితే నేటి యువత చెడు వ్యసన్నకు బానిసై వినాయక నిమజ్జనాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వినాయక నిమజ్జనంలో భక్తిశ్రద్ధలతో ఊరేగిస్తూ భజన కీర్తనలతో కొనసాగుతూ నిమజ్జనం చేయాలని తెలిపారు అదే విధంగా పోలీసు వ్యవస్థకు సహకరించి నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.