బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టకపోతే బిజెపి పార్టీతో యుద్ధమే
బచ్చన్నపేట ( జనం సాక్షి ) సెప్టెంబర్ 21 వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టకపోతే బిజెపి పార్టీతో యుద్ధమేనని ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ బచ్చన్నపేట మండల ఇన్చార్జి అంబేద్కర్ మాదిగ అన్నారు.గురువారం బచ్చన్నపేట ప్రధానచౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి ఇంచార్జ్ కర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ. ప్రస్తుత జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ ల ఏబీసీడీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ ప్రవేశపెట్టాలని అన్నారు. లేకపోతే బిజెపికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని వారు హెచ్చరించారు. అన్ని సభలలో మాదిగల ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణ చేస్తామని హామీలు ఇచ్చినటువంటి బిజెపి నాయకులు ఇప్పుడు ఒత్తిడి తీసుకురాకపోవడం అనేది శోచనీయం కావున వెంటనే వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో కనుక ప్రవేశ పెట్టకపోతే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఏ జిల్లా కార్యదర్శి అల్వాల్ రాజు ఎం ఎస్ పి జనగామ జిల్లా నాయకులు అల్వాల నర్సింగారావు. ఎంఎస్పి మండల నాయకులు. నల్ల శ్రీనివాస్. పాకాల కుమారస్వామి నల్ల అంజయ్య మాదిగ. తుడుం రాజు. అల్వాల అనిల్. పాకాల కుమారస్వామి. అల్వాలస్వామి.బవండ్ల పల్లి బాలరాజు.కర్రీ అల్వాల మనేపల్లి భూమయ్య రాజయ్య అల్వాల అజయ్ ఇతదితరులు కర్రె బిక్షపతి తదితరులు పాల్గొన్నారు