ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష..

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 22. (జనంసాక్షి). పెండింగ్  స్కాలర్షిప్ లను విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంబెడ్కర్ చౌరస్తా వద్ద  ఫీజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో  పెండింగ్ స్కాలర్షిప్ లను ,ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 517 7 కోట్ల నిధులను విడుదల చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ లను పెంచాలని  కోరారు. నిరసన దీక్షలో మంద అనిల్, రాజశేఖర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.