రాజన్న ఆలయ నిధుల మళ్లింపు పై బిజెపి ఆగ్రహం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 22. (జనంసాక్షి). వేములవాడ దేవస్థానం నిధులను మళ్ళించడం పై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా బిజెపి నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ వేములవాడ ఆలయానికి సంబంధించిన ఐదు కోట్ల నిధులు ఇతర జిల్లాలకు మళ్లింపు చేయడంపై మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణం నిధుల మళ్లింపులు ఆపాలని డిమాండ్ చేశారు నిరసన కార్యక్రమంలో. బిజెపి నాయకులు నాగుల శ్రీనివాస్, ఆడెపు రవీందర్, శ్రీ గాధ మైసయ్య, చెన్నమనేని కమలాకర్ రావు, దాసరి శ్రీనివాస్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.