46 వార్డులో ఘనంగా కుంకుమార్చన
బీఆర్ఎస్ వార్డ్ ఇంఛార్జ్ భావ్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గణపతి నవరాత్రి ఉత్సవాల ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా 46వ వార్డు బీఆర్ఎస్ ఇంఛార్జ్ ఆంగోతు సంధ్య భావ్ సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి శుభాలు కలిగి, విఘ్నాలు తొలగాలని ఆకాంక్షించారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లా ఏర్పాటు, మెడికల్ కళాశాల, నూతన కలెక్టరేట్, ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్, సద్దల చెరువుని మినీ ట్యాంక్ బండ్ గా ఏర్పాటు చేశారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని, గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని మంత్రి ఆచరణలో చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు కార్యదర్శి మద్దూరి సుధాకర్, పబ్బ ప్రకాష్ , రేపాల యాదగిరి, తెడ్ల అమర్నాథ్, దేవేంద్రచారి, నల్లపాటి శ్రీధర్, కృష్ణమాచారి, శ్రీరంగం కళ్యాణ్, గొడిశాల శంకర్, రాములు,మడూరి ఉపేందర్, సూదిరెడ్డి వెంకట్ రెడ్డి, కోట్ల రజితారెడ్డి, కాసర్ల మాధవి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.