24 న సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం

-మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యం
వరంగల్ ఈస్ట్, జూలై 21(జనం సాక్షి);
ఈ  నెల 24వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా  సామూహికంగా మొక్కలు నాటుట కు చర్యలు తీసుకోవాలని జిడబ్ల్యూఎంసి కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.  గురువారం  జిడబ్ల్యూ ఎం సి పరిధిలోని చింత గట్టు ఎస్ ఆర్ ఎస్ పి క్యాంపు ప్రాంగణంలో ఒక ఎకరం  విస్తీర్ణంలో మొక్కలు నాటుట కు ఏర్పాటుచేసిన పట్టణ ప్రకృతి వనాన్ని కమిషనర్ పరిశీలించి, తక్షణమే చుట్టుపక్కల ఫెన్సింగ్. పాత్ వే, దారి ఏర్పాటు చేయాలని
ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సామూహికంగా మొక్కలు నాటుట కు తగిన ఏర్పాట్లు అన్ని చేయాలని  ముఖ్య ఉద్యానవన అధికారిని ఆదేశించారు.66 వ డివిజన్ లోని  ఎస్సీ,  బీసీ కాలనీ లను సందర్శించి ఆయా కాలనీలలో అంతర్గత రహదారులు మురుగుకాల్వల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలను  సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కుడా ఆధ్వర్యంలో దేవన్నపేటలో  మంజూరు నిమిత్తం దరఖాస్తు చేసుకొన్న  లేఅవుట్ స్థలాన్ని కుడా వైస్ చైర్మన్ మరియు కమిషనర్ ప్రావీణ్య పరిశీలించారు.
కమిషనర్ వెంట కూడా ప్రాజెక్టు అధికారి అజిత్ రెడ్డి, ఏ పీ ఓ రవీందర్,  బల్దియా సి హెచ్ ఓ శ్రీనివాస రావు,  హెచ్ ఓ  ప్రెసిల్లా, డి ఈ రవి కుమార్ తదితరులు ఉన్నారు.