25న జిల్లాస్థాయి యోగా పోటీలు

నిజామాబాద్‌, నవంబర్‌ 3: జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 4న జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌ మున్నూరు కాపు సంఘంలో 25వ జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాంచందర్‌, యోగా సిద్ధిరాములు తెలిపారు. పోటీలను అర్బన్‌ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ప్రారంభిస్తారని, ముగింపు కార్యక్రమంలో డిఐజీ సంజయ్‌ పాల్గొంటారని తెలిపారు. యోగా సంఘం జిల్లాలో 1987లో ఏర్పడింది. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం జిల్లాలోని కామారెడ్డి, బోధన్‌, అక్బర్‌నగర్‌, ఆర్మూర్‌ తదితర కేంద్రాల్లో పోటీలు నిర్వహించి ఎందరినో రాష్ట్ర , జాతీయ స్థాయి క్రీడాకారులను అందించారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 16 మంది జాతీయ క్రీడాకారులు అనేక సార్లు జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచారు.