28దే డెడ్‌లైన్
అనుకూల ప్రకటన రాకపోతే పార్టీని వీడుతాం
స్వరం పెంచిన టీ ఎంపీలు
తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే కఠిన నిర్ణయాలకు సైతం వెనుకాడబోమని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వమని చెబితే పదవులతో పాటు పార్టీని వీడేందుకూ సిద్ధమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజా’ వ్యాఖ్యల నేపథ్యంలో టీ-కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం మందా జగన్నాథం నిసవాంలో సమావేశమయ్యారు. ఆజా’ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి? అనే దానిపై చర్చించారు. హైకమాాంపై ఒత్తిడి ఎలా పెంచాలనే దానిపై తర్జనభర్జన పడ్డారు. బడ్జెట్ సమావేశాలు బహిష్కరిద్దామని కొందరు, రాజీనామాలు చేద్దామని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే, షిండే ప్రకటించిన 28కి ఇంకా రెండ్రోజులు గడువు ఉందని.. అప్పటివరకు ఆగాలని నిర్ణయించారు. ఆలోగా ప్రకటన రాకుంటే ఆ తర్వాత మరోసారి సమావేశమైన కఠిన నిర్ణయాలు తీసుకుందామని అభిప్రాయపడ్డారు. భవిష్య’ కార్యాచరణ, టీఆంఎస్, జేఏసీలతో కలిసి పని చేద్దామనే దానిపైనా సమావేశంలో చర్చ జరిగింది. కేసీఆంతో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కావడంపై టీ-ఎంపీలు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. భేటీకి ముందు మందా జగన్నాథం మాట్లాడుతూ.. ఆజా’ వ్యాఖ్యలతో తెలంగాణకు మరోసారి మోసం జరిగిందన్నారు. ఆజా’ ప్రకటన తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. అటువంటి ప్రకటన చేయాల్సింది కాదని, ఆజా’ వ్యాఖ్యలతో తమకు పార్టీపై నమ్మకం నమ్మకం పోయిందన్నారు. ఈ నెల 28లోగా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకుంటే భవిష్య’ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకుంటున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణపై వెనక్కు తిరిగి రాలేనంత దూరం వెళ్లిపోయామని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఇవ్వడం మినహా వేరే గత్యంతరం లేదని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. తెలంగాణ సాధన కోసం తాము ఎవరితోనైనా కలుస్తామని ఎంపీ గుత్తా సుఖేందంరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కోసమే తాము, తమ పార్టీ నేతలు కేసీఆంను కానీ, జేఏసీ నేతలను కానీ కలుస్తుంటారని గుత్తా అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆంను కలవడంపై ప్రశ్నించగా.. ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. అయితే, ఎలాంటి నిర్ణయాలకైనా వెనుకాడని పరిస్థితి ఏర్పడిందన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి టీ-కాంగ్రెస్ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ప్రస్తుతం టీఆంఎస్‌లో చేరే పరిస్థితి లేదని, అందరితో కలిసి చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ ఇచ్చేది లేదని కాంగ్రెస్ చెబితే పదవులకు రాజీనామాలు సహా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని మరో ఎంపీ వివేచీ హెచ్చరించారు. పార్టీని వీడేందుకూ సిద్ధమేనని ప్రకటించారు. కొంత మంది సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గి తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేయడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకొనేందుకు రాజీనామాలు చేస్తామని సీమాంధ్ర నేతలు హెచ్చరిస్తున్నారని… ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం విూరేందుకు రాజీనామాలు చేయడం లేదని ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తాము ఇప్పటికే హైకమాాం దృష్టికి తీసుకెళ్లామని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది వారేనన్నారు.