30న ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఎం జె ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం.

 -ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. 30న ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఎం జె ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం. -ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. -రక్తదానం చేసిన 2250మందియువతీయువకులు,అభిమానులు.
నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:
ఈనెల 30న నాగర్ కర్నూల్  ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఎం జె ఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్,డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యి రిబ్బన్ కత్తిరించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో రక్త నిల్వల కొరత లేకుండా ఎం జె ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క పిలుపుతో  2250 మంది యువతి యువకులు అభిమానులు పార్టీ కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో రక్తం నిలువల కొరత లేకుండా  తన జన్మదినం సందర్భంగా ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. రాష్ట్రంలో తల సేమియా రోగులకు కానీ వివిధ సందర్భాల్లో ప్రమాదానికి గురై రక్తం కోల్పోయి బాధపడుతున్న వారికి గాని ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి 2250 యూనిట్ల రక్తాన్ని దానం చేసినందుకు వారందరి ప్రాణాలు కాపాడవచ్చు అని తెలిపారు, ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ వనపర్తి హైదరాబాద్ జిల్లాల బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ కల్పనా భాస్కర్ గౌడ్, బిజినపల్లి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు మంగి విజయ్, పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు భాస్కర్ గౌడ్, ఈశ్వర్,హరికృష్ణ లతో పాటు తదితర  పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.