30న పిఆర్‌టియు ధర్నా
ఖమ్మం, అక్టోబర్ 28: మదిర ఉపవిద్యాశాఖాధికారి వైఖరికి నిరసనగా ఈ నెల 30న మదిరలో ధర్నా నిర్వహించనున్నట్లు పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ తెలిపారు. మదిర డిప్యూటీ డిఇఓ వెంకటనర్సమ్మ ఉపాధ్యాయులను మానసికంగా హింసిస్తున్నారని అన్నారు. ఆమె వైఖరిని మార్చు కోవాలని వారు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. ఆమె వైఖరిలో మార్పు వచ్చే వరకు పోరాటాలు నిర్వహిస్తా మన్నారు. ఇకనైనా డిప్యూటీ డిఇఓ ఉపాధ్యాయుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని మార్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 30న జరగబోయే ధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.