30 జిల్లా కేంద్రాల్లో మంత్రుల జెండావందనం

ఆయా జిల్లాల్లో జెండా ఎగురవేసే వారి పేర్లు ప్రకటన

హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 30 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జెండా ఎగురేసి వందనం స్వీకరస్తారు. అలాగే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రభుత్వ ప్రాధాన్యాలను, విజయాలను వివరిస్తారు. ఇందుకోసం ఎవరు ఎక్కడ జెండా ఎగురేయాలన్నది ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో జెండా వందనం చేసే మంత్రులు, ఇతర ప్రముఖుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్గా జిల్లాలు ఏర్పడడ్డ తరవాత వరుసగా రెండో ఏడాది కూడా గందరగోళం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మంత్రులకు తోడు శాసనసభాపతి, మండలి ఛైర్మన్‌, ప్రభుత్వ ఛీఫ్‌ విప్‌లు, విప్‌లు, ఇతర ప్రముఖులకు, ఉన్నతాధికారులకు జెండా ఎగురవేసే అవకాశం కల్పించింది. వీరు అమరవీరులకు నివాళి, గౌరవవందనం స్వీకరణ, జెండా వందనంతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎంపిక చేసిన వ్యక్తులకు పురస్కారాలను పంపిణీ చేస్తారు. ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వరంగల్‌ అర్బన్‌/-లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి,రంగారెడ్డిలోమరో ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, కరీంనగర్‌లో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ జెండా ఎగురవేస్తారు. ఇకపోతే శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జెండావందనం స్వీకరిస్తారు.