31న కలెక్టరేట్ ముట్టడి
ఖమ్మం, అక్టోబర్ 29: బయ్యరంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి నిర్వహించనున్నట్లు ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి శివరామకృష్ణ తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఆపారమైన ఖనిజా సంపద ఉందని ఉక్కు కర్మాగారం నిర్మించడం వల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని అన్నారు. ప్రత్యేక్ష్యంగా, పరోక్షంగా లక్ష్యకు పైగా కుటుంబాలకు ఉద్యోగం లభిస్తుందన్నారు. ఈ కారణంతో జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఎంతో అవశ్యమని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కార్యచరణ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. బయ్యరం ఉక్కు ఖమ్మం జిల్లా హక్కు అనే నినాదంతో 31న పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు.