33వ భాజపా ఆవిర్భావ దినోత్సవం

కమాన్‌పూర్‌: భాజపా 33వ ఆవిర్భావ దినోత్సవాన్ని కమాన్‌పూర్‌ మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మట్ట శంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాలు కేవలం భాజపా తోనే సాధ్యం అని, ఇప్పటికే మూడు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ఘనత భాజపాకే దక్కిందన్నారు. నాయకులు బస్టాండ్‌ ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించి , మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.