39 వ డివిజన్లో జోరుగా కాంగ్రెస్ ప్రచారం

వరంగల్ ఈస్ట్, నవంబర్ 21 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 39వ డివిజన్ బూత్ నెంబర్ 124,123 లలో విద్యానగర్ ఏ ఎస్ ఎం కాలేజీ ప్రాంతం లో ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను చేయి గుర్తుపై ఓటు వేసి కొండా సురేఖను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమం లో డివిజన్ యూత్ నాయకులు గుడికందుల క్రాంతి, సీనియర్ నాయకులు సిద్ధం రాము, కత్తెరశాల గణేష్,బూత్ కమిటీ ఇంచార్జ్లు ఆకులకుమారస్వామి, గట్టు శివాజీ, జూల కిరణ్, నాయకులు పిన్న రమేష్,కావటి రవీందర్, ముటికే నరేష్ జోషి,మహిళ కాంగ్రెస్ తోట రమాదేవి, యూత్ నాయకులు బజ్జురి రజనిష్, సొల ప్రశాంత్,సింగారపు సురేష్, రోహిత్ జోషి వైరాల, విద్య, శ్రీలత,వనం సర్వేశ్వరి, గీత పిట్టల, వరలక్ష్మి పౌడల తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

తాజావార్తలు