4లైన్ల కాకినాడ కెనాల్‌ రోడ్ల విస్తరణ :జిల్లా కలక్టర్‌

కాకినాడ, జూలై 23,: కాకినాడ రాజమండ్రి కెనాల్‌ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అమలుతో పాటు విస్తరణ పనులు త్వరితంగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్‌ నీతూప్రసాద్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ఏర్పాటైన ప్రాజెక్టు లెవెల్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం కాకినాడ జిల్లా కలక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధ్యక్షతన జరిగింది. ఈ సంధర్బంగా కలక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర విస్తరణ పనులు త్వరితగతిన జరిగేలా చర్యలు చేపట్టాలని ఉందన్నారు. ఇప్పటికే కాకినాడ రాజమండ్రి కెనాల్‌ రోడ్డు విస్తరణకు సంబంధించి భూసేకరణ పనులకు గాను రాజమండ్రి రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇఇ రాజమండ్రి ఆర్డీఓ వద్ద 2.5, కోట్లు కాకినాడ ఆర్డోఓ వద్ద 12కోట్లు మొత్తం 14.15కోట్ల రూపాయలను డిపాజిట్‌ చేసినందున భూసేకరణ పనులను త్వరితంగా పూర్తి చేయాలని కలక్టర్‌ ఆదేశించారు. ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో ఇళ్ళ ఇతర ఆస్తులు పోగొట్టుకునే నిర్వాసితులకు ప్రభుత్వ జిఓ నం 68 ప్రకారం అవసరమైన మెరుగైన పునరావాస ప్యాకేజీని అమలు చేసేందుకు వీలుగా రెవెన్యూ, సంబంధిత ఎన్‌జిఓలు సంయుక్త సర్వే చేపట్టి భాధితులకు అవసరమైన పునరావాసాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలక్టర్‌ ఆదేశించారు.