40 మంది మృతి వణికిన ఉత్తర భారతం

గల్ఫ్‌పైనా ప్రభావంన్యూఢిల్లీ, ఏప్రిల్‌16 (జనంసాక్షి) :
భారీ భూకంపం ఇరాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాలను కుదిపేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సంభవించిన 7.8 తీవ్రతగల భూకంపం ధాటికి 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇరాన్‌లోని ఖాష్‌లో పదిహేను కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్‌, గల్ఫ్‌ దేశాలు, పాకిస్తాన్‌, భారత్‌లపై భూకంప ప్రభావం పడింది. ఇరాన్‌ను ఈ భారీ భూకంపం వణికించింది. ఖాష్‌ పట్టణంలో దాదాపు నలబై మంది మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. వేల మంది నిరాశ్ర యులయ్యారు. పలు భవంతులు కుప్పకూ లాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు. భూకంపం కారణంగా పాక్‌లో ఐదుగురు మృతి చెందారు. ఈ మిగతా 2లోపెను భూకంపం తాలూకు ప్రకంపనలు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో కన్పించాయి. ప్రకంపనల తీవ్రత ఎంత తీవ్రంగా ఉందంటే ఇక్కడ మరో భూకంపం సంభవించినట్లుగా భావించారు. ఇరాన్‌, పాకిస్థాన్‌ దేశాల సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భూకంపం తాలూకు ప్రకంపనలు పంజాబ్‌, హర్యానా, జమ్మూకాశ్మీర్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లో దాదాపు 45 సెకన్ల పాటు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. ప్రజలు ఆందోళన చెందిన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. పాకిస్థాన్‌ -ఇరాన్‌ సరిహద్దుల్లో కూడా భారీ భూకంపం తీవ్రత కనిపించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 7.8గా నమోదయింది. పాకిస్థాన్‌ – ఇరాన్‌ సరిహద్దుల్లోని కాస్‌లో 15 కిలోవిూటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. పాకిస్థాన్‌లోని ముల్తాన్‌, దక్షిణ పంజాబ్‌ రాషాలెతోపాటు దుబాయ్‌, షార్జా, అరబ్‌ ఎమిరెట్స్‌లలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో భూమి స్వల్పంగా కంపించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు భయానికి గురై ఇళ్ల నుండి, అపార్టుమెంటుల నుండి, కార్యాలయ నుండి బయటకు వచ్చారు. మధ్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. నోయిడాలోను భూమి కంపించింది. దాదాపు పది నుండి ఇరవై సెకన్ల మధ్య ఆయా ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా చెబుతున్నారు. రిక్టర్‌ స్కేలు పైన ఇది 5.6గా ఉంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో భవంతులు పడిపోతాయేమోనని ప్రజలు ఆందోళనకు