43వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష.
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 30(జనంసాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ఆర్ పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సాగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్షలు నేటికీ 43వ రోజుకు చేరుకున్నాయి. ఎంఆర్పిఎస్ జిల్లా అద్యక్షులు దేపంగి రమణయ్య ఆధ్వర్యంలో శుక్రవారం వంగూరి సావిత్రి, చెక్కా నరసమ్మ, మిరియాల తిరుపతమ్మ, మిరియాల శాంతమ్మ, కేసరి అంజమ్మ, చింత రజిత, కొమ్ము ముత్తమ్మ, మిరియాల వెంకటమ్మ, మారపాక ముత్తమ్మ, రహీ మున్నీసా బేగం, మిరియాల చిట్టెమ్మ, సీఐటీయూ మండల కన్వినర్ నాయకులు బర్ల తిరుపతిరావు తదితరులు దీక్ష లో పాల్గొన్నారు. దీక్షలో కూర్చున్న వారికి మద్దతుగా జేఏసీ కన్వీనర్ కేవీ రమణ, ప్రధాన కార్యదర్శి దామర శ్రీనివాసరావు, దేపంగి రమణయ్య, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, ఎస్.కె నయీమ్, శాంకూరి వెంకటేశ్వర్లు, పోల్కొండ ప్రభాకర్, రాయల వెంకటేశ్వర్లు, ఎస్.కె నజీరుద్దిన్, కొమ్ము పాపయ్య, వంగూరి రాజేష్, కోట వినోద్, చెక్క ఈశ్వరయ్య తదితరులు సంఘీభావం ప్రకటించారు.