నింగినంటిన విద్రోహ నిరసనలు

గాంధీ భవన్‌ను ముట్టడించిన జేఏసీ
కోదండరామ్‌తో సహా పలువురి అరెస్ట్‌
పది జిల్లాల్లో కాంగ్రెస్‌ కార్యాలయాల ముట్టడి
‘మన నేతల’ చేతగాని తనంవల్లే ఈ దుస్థితి
అఖిలపక్షంలో పార్టీల వైఖరి తర్వాతే భవిష్యత్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుల అసమర్థత వల్లే వచ్చిన తెలంగాణ వెనక్కుపోయిందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ రోపించారు. కేంద్రం తెలంగాణ ప్రకటనను డిసెంబర్‌ 23న వెనక్కు తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం తెలంగాణవ్యాప్తంగా విద్రోహదినంగా ప్రకటించారు. పది జిల్లాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనల్లో పాల్గొన్నారు. రాత్రి కొవ్వొత్తులతో తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న వారికి నివాళులర్పించారు. హైదరాబాద్‌ టీఎన్జీఓ భవన్‌ వద్ద జేఏసీ కార్యకర్తలు కోదండరామ్‌ నాయకత్వంలో నిరసన తెలిపారు. అనంతరం టీ జేఏసీ కార్యకర్తలు గాంధీ భవన్‌వైపునకు దూసుకువెళ్లి అక్కడ బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు తెలంగాణ వాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం కోదండరామ్‌ సహా టీ జేఏసీ నాయకులను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోదండరామ్‌ అరెస్టును నిరసిస్తూ టీ జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. అరెస్టయిన కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తెలంగాణవాదులకు లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతం ప్రజాస్వామ్యంలో ఉందా? లేక ఎమర్జెన్సీలో ఉందా అనే విషయం తనకు అర్థం కావడంలేదని ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేవలం తెలంగాణ రాజకీయ నాయకుల సహకారం ప్రజా ఆకాంక్షకు విలువనివ్వకపోవడం వల్లే యువకులు ఆత్మబలిదానాలకు సిద్ధపడుతున్నారని, ఇప్పటికైనా తెలంగాణ రాజకీయ నాయకులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుల అసమర్థత వల్లే వచ్చిన తెలంగాణ వెనక్కుపోయిందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ రోపించారు. కేంద్రం తెలంగాణ ప్రకటనను డిసెంబర్‌ 23న వెనక్కు తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం తెలంగాణవ్యాప్తంగా విద్రోహదినంగా ప్రకటించారు. పది జిల్లాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనల్లో పాల్గొన్నారు. రాత్రి కొవ్వొత్తులతో తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న వారికి నివాళులర్పించారు. హైదరాబాద్‌ టీఎన్జీఓ భవన్‌ వద్ద జేఏసీ కార్యకర్తలు కోదండరామ్‌ నాయకత్వంలో నిరసన తెలిపారు. అనంతరం టీ జేఏసీ కార్యకర్తలు గాంధీ భవన్‌వైపునకు దూసుకువెళ్లి అక్కడ బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు తెలంగాణ వాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం కోదండరామ్‌ సహా టీ జేఏసీ నాయకులను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోదండరామ్‌ అరెస్టును నిరసిస్తూ టీ జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. అరెస్టయిన కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తెలంగాణవాదులకు లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతం ప్రజాస్వామ్యంలో ఉందా? లేక ఎమర్జెన్సీలో ఉందా అనే విషయం తనకు అర్థం కావడంలేదని ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేవలం తెలంగాణ రాజకీయ నాయకుల సహకారం ప్రజా ఆకాంక్షకు విలువనివ్వకపోవడం వల్లే యువకులు ఆత్మబలిదానాలకు సిద్ధపడుతున్నారని, ఇప్పటికైనా తెలంగాణ రాజకీయ నాయకులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విషయాన్ని తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. అఖిలపక్షంలో పాల్గొనే రాజకీయ పార్టీల నాయకులంతా తెలంగాణకు అనుకూలంగా ఏకాభిప్రాయం వెల్లడించాలని కోరారు. అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలంగా చెప్పని రాజకీయ పార్టీలను తెలంగాణ ప్రాంతంలో బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. 28న పార్టీల వైఖరిని బట్టే తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని కోదండరామ్‌ స్పష్టం చేశారు. కోదండరాం అరెస్టును తెలంగాణ రాజకీయ జేఏసీ తీవ్రంగా ఖండించింది. న్యూడెమోక్రసీ నాయకులు సూర్యం మాట్లాడుతూ కోదండరామ్‌ను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీనివాసగౌడ్‌, దేవీప్రసాద్‌, విఠల్‌, తదితరులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలోని తెలంగాణవాదులు నల్లజెండాలు ఎగురవేసి విద్రోహదినంగా పాటించారు.