5.4 కిలోల బంగారం చోరి

చెన్నై: ముంబై నగల వ్యాపారి కన్నుగప్పి 5.4కిలోల బంగారు నగలు దోచుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. ముంబై కల్పాదేవికాక్కాడు మార్కెట్‌కు చెందిన సంజయ్‌ జైన్‌ బంగారు నగల వ్యాపారి, మనోజ్‌, గుజాల్‌పాల్‌ సింగ్‌లు విక్రయదారులుగా విధులు నిర్వహిస్తున్నారు. తమ యజమాని ఆదేశాల మేరకు వీరిద్దరూ దక్షిణాదిలో, ముఖ్యంగా తమిళనాడులోని కోవై, తిరుచ్చి, మధురై, చెన్నై ప్రాంతాల్లో నగలు విక్రయిస్తుంటారు. ఈ కోవలో 5.5కిలోల బంగారు నగలతో గత 28వ తేదీన కోవైకి వచ్చారు. ఆరోజు అక్కడ వ్యాపారం లేకపోవటంతో అదేరోజు రాత్రి మధరైకి బయలుదేరారు. అక్కడ 125గ్రాముల బంగారాన్ని మాత్రం విక్రయించి మిగతా బంగారంతో మంగళవారం రాత్రి మధురై నుంచి చెన్నైకు బయులదేరారు. ఉదయం కోయంబేడు బస్టాండుకు వచ్చాక నగల సంచి కనిపించకపోవటంతో ఇద్దరూ అవాక్కయ్యారు. దీనిపై కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారు.