55.68 లక్షల విలువగల గుట్కా నిల్వలు స్వాధీనం

గుంటూరు : రాష్టంలో గుట్కాలపై నిషేధం ఉన్నా భారీగా విక్రయాలు జరిపేందుకు గుంటూరు నగరంలో అక్రమంగా నిల్వచేసిన సరుకును విజిలెన్స్‌ ఎన్‌ఫోర్‌సమెంట్‌, ఆహారం తనిఖీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో భారీగా నిల్వలను గుర్తించారు. ఏటుకూరురోడ్డులో గుట్కా వ్యాపారి మాడా శ్రీనివాసమూర్తి..హేమ మార్కెంటింగ్‌ సంస్థ పేరుతో గుట్కాలు తయారుచేస్తూ మనససరోవరం ప్రాంతంలోని ఓ గోదాములో నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 580 బస్తాల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 55.68 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.