61వ రోజుకు చేరిన విఆర్ఎ ల శాంతియుత సమ్మె…
పినపాక, సెప్టెంబర్ 23(జనంసాక్షి):-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వీఆర్ఏలు తమ యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెవిరమించేది లేదని 61వ రోజు శాంతియుత ధర్నా చేస్తున్న సందర్భంగా
తెలియజేసారు.ఈ దీక్షలో వీఆర్ఏల మండలాధ్యక్షుడు సిహెచ్ కొండయ్య ,ఉపాధ్యక్షుడు రోశయ్య, కార్యదర్శి సిహెచ్ నరసింహారావు ,జనరల్ సెక్రటరీ బోడా రమణ, 22 మంది వీఆర్ఏలు పాల్గొని నిరసన తెలియపరిచినారు