ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
వరంగల్,(జనంసాక్షి): హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది ముందస్తుగా రిజిష్టర్‌లో సంతకాలు చేయటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారిని పిలిపించి విధులకు హాజరుకాకున్నా సంతకాలు పెట్టిన ఆరుగురు సిబ్బందికి షోకాజ్ పోటీసులు అందజేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు ఉండటంతో అధికారులను కలెక్టర్ తీవ్రంగా మందలించారు.