రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల : రమాకాంత్‌రెడ్డి
వరంగల్,(జనంసాక్షి): రేపు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల నోటిఫికేషన్లను జిల్లా కలెక్టర్ విడుదల చేస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందన్నారు. పంచాయితీ వేలంపాట నిర్వహణపై ఇప్పటికి 5 జిల్లాల నుంచి ఫర్యాదులు అందాయని, రెండు జిల్లాల్లో కేసులు నమోదు చేశామని తెలిపారు. ఏకగ్రీవమయ్యే పంచాయితీలకు రూ.5 నుంచి రూ. 15 లక్షల వరకు ప్రభుత్వం ప్రొత్సాహకాలు అందిస్తుందని రమాకాంత్‌రెడ్డి చెప్పారు.