రైలు నుంచి జారీ పడి మహిళ మృతి
వరంగల్,(జనంసాక్షి): సంగెం మండలం ఏలూకూరురంగంపేటలో గత అర్ధరాత్రి వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి ఓ మహిళ ప్రమాదవశాస్తు జానీ పడి మరణించింది. దీంతో తోటి ప్రయాణికులు రైల్వే గార్డుకు సమాచారం అందించారు. దాంతో గార్డు సమీపంలోనొ రైల్వే అధికారులకు ఆ విషయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోస్ట్ మార్టర్ నిమిత్తం మృతదేహాన్ని వరంగల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలు నెల్లూరు జిల్లాకు చెందిన శ్యామలారెడ్డిగా గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సమాచారాన్ని ఆమె కుటుంబ సభ్యులకు సభ్యులకు చేరవేసినట్లు రేల్వే పోలీసులు చెప్పారు.