విద్యుత్ షాక్‌తో సర్పంచ్ అభ్యర్థిని మృతి
వరంగల్,(జనంసాక్షి): జిల్లాలోని నర్సింహులపేట మండలంలో వంతడుపుల గ్రామంలో విద్యుత్‌షాక్‌తో తల్లి కూతురు మృతి చెందారు. మృతుల్లో రోజ(22) సర్పంచ్ అభ్యర్థినిగా పోటీలో బరిలో నిలిచింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో తల్లి కూడా మరణించింది. ఇంట్లో విద్యుత్ బల్బును సరిచేస్తూ కంచెనపల్లి రోజ విద్యుత్ షాక్ గురయ్యారు. రోజ టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. ఈ ఘటనతో వంతడుపుల గ్రామంలో విషాదం అలుముకుంది.దీంతో వంతడుపుల గ్రామపంచాయతీ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.