తెలంగాణ సాయుధ పోరాట సేనాని మఖ్ధూం

ప్రవహించే జీవనదులు మఖ్ధూం జ్ఞాపకం తెలంగాణా పోరాటానికి ప్రతిరూపంప్రేరణ సూర్ఫి దాయకం మఖ్ధూం – తెలంగాణా ప్రజల్లో చైతన్యానికి నిజాం నవాబ్‌ పటేలే పట్వారీ. దేశ్‌ముఖులకు వ్యతిరేంకగా తెలంగాణా సాయుధ పోరాటం ద్వారానే తరిమి కొట్టారు. భారతదేశంలో హైదరాబాద్‌ అనంత రం సాయుధ పోరాటాన్ని బలపరిచిన ప్రజాతంత్ర శక్తులు అని చెప్పవచ్చు. తొలితరం కమ్యూనిస్టు యోధుడు ప్రజాకవి, కార్మిక వర్గ నాయకుడు, మహ్మద్‌ మఖ్ధూంమొహీయుద్దీన్‌ ఆంధ్ర రాష్ట్రం లోని మెతుకులేని మెదక్‌ జిల్లా ఆంథోల్‌లో 1908 ఫిబ్రవరి 4న జన్మించాడు. మఖ్ధూం మొహియుద్దీన్‌ హుజ్రీ  వీరి పూర్వ కవీకు లది ఉత్తరప్రదేవ్‌లోని అజంగజ్‌ప ప్రాంతం, ఉత్తర ప్రదేశ్‌ ప్రాం తం పుంచి బ్రతుకుదెరువు కోసం మెదక్‌ జిల్లా ఆందోల్‌కు వలస వచ్చాడు. మఖ్ధూం తండ్రి నిజాం ప్రభుత్వంలో సూపరిం టిండెం ట్‌గా పని చేశాడు. ఆయన పసితనంలోనే తండ్రి చనిపో యాబు. తం5డి పరమ భక్తుడు. మహ్మద్‌ గౌసే ఆయన తల్లి ఉమ్ధాబేగం భర్త మరణాంతరం మరో వివాహం చేసుకుంది. పినతండ్రి అయన బషీరుద్దీన్‌ దగ్గర మఖ్ధూం పెరిగిడు. మఖ్ధూం విధ్యాభాసం ఆందోల్‌ నుంచి మొదలైంది. 1929లో ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తయ్యింది. ప్రాథమిక విద్య హైదరాబాద్‌లోని ధర్మవంత లో, మెట్రిక్‌లేషన్‌ మెదక్‌ జిల్లా కేం5దమైన సంగారెడ్డిలో చదివాడు. మఖ్ధూంకు బాల్య దశ నుంచి ఆలోచించడం, పుస్తకాలు చదవడం, వ్రాయడం, సాహిత్యం వైపు దృష్టి మల్చాడు. అపర మేధావి కార్ల్‌మార్క్‌ రచించిన సుపకతకాలను మఖ్ధూం చదివి మార్క్సిజం వైపు వైపు మరలినాడు. మెదక్‌ జిల్లా సంగారెడ్డి కార్మిక ఉద్యమంలో మఖ్ధూం చెరగని ముద్ర వేసుకున్నాడు. వామపక్ష ప్రజాఉద్యమానికి ఎంతో శ్రమించాడు. మఖ్ధూంను మూడు విధాలుగా చూడవచ్చు. అంతర్జాతీయ ఉర్ధూకవిగా, కమ్యూనిస్టునాయకుడిగా, కార్మికవర్గం నాయకుడిగా కనిసిప్తాడు. మఖ్ధూం ఆనాటి కాలంలో కష్టపడుతూ చదువుకున్నాడు. ఉద్యమ అవసరాలరిత్యా మఖ్ధూం ట్యూషన్లు చెప్పాడు. చిత్ర పటాలనను అమ్మసాగాడు. వివిధ పత్రికలకు వ్యాసా లు రాసాడు. హైదరాబాద్‌లో రాష్ట్ర దప్తర్‌లో గుమస్తాగా , అనం తరం హైదరాబాద్‌లోని సిటీ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. ఆయన విజయమంతా కష్టాల సుడిగుండాలతో కొనసాగిం ది. జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురొచ్చినా తానునమ్ముకున్న సిద్దాంతాన్ని ఏనాడు వీడిపోలేదు. తుది శ్వాస విడిచేంతవరకు సూజల కోసం, నిస్వార్థంగా ఉద్యమించిన నిరాడంబరజీవి. హైదరా బాద్‌లో కామ్రేడ్సీ అసోసియేషన్‌ పేరుతో చర్చ వేదికను నడుపు తున్నారు. చర్చ వేదికలో మఖ్ధూం డా.రాజబహదూర్‌గౌర్‌ వంటి మహనీయులు కమ్యూనిస్టు పార్టీవైపు నిలిచారు. వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులలో సోషలి భావాలు కలిగిన దేవులపెల్లి వెంకటేశ్వర్‌రావు రామనాథంలు కమ్యూనిస్టులుగా ఏర్పడినారు.సోషలిస్టు భావాల వ్యాప్తికి ఎంతో శ్రమించారు. మతోన్మాదానికి వ్యతిరేఖంగా తాకిక శక్తులను ఏకం చేసినాడు. మార్క్సిజం-లెనినిజం ఆలోజన విధానాలను యువకులకు నూరిపో శాడు. రాజకీయంగా దోపిడికి వ్యతిరేఖంగా జనాన్ని  సమీకరిం చాడు.రైతాంగ ఉద్యమానికి ఎకారం చుట్టాడు. మఖ్ధూం  తన కార్యకలాపాలను తెలంగాణా రాజకీయ జీవితంలోనే గొప్ప మార్పులు తీసుకవచ్చినాయి. మఖ్ధూం వ్యక్తి గత జీవితం చాలా నిరాడంబరమైంది. సాదాసీదా బట్టలు తప్ప ఆడంబరాలకు అతి దూరం. తెలంగాణా ప్రాంతానికి ప్రపంచ వాప్తంగా పేరు తెచ్చిన మహనీయుడు మఖ్ధూం. భూ పోరాటం కార్మిక ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. నిజాం నిరంకుశ రాచరిక పాలనకు వ్యరేఖంగా తెలంగాణా రైతుల సాయుధ పోరాటాన్ని పల్లె పల్లెలో విప్లవాన్ని రగిల్చారు.ఆనాటి మహత్తర పూజా పోరాటంతో పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, బద్దం మల్లారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రాంచాంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్‌ రావు, మఖ్ధూంలు నేటికి సజీవంగా ప్రజల హృదయాల్లో నిలిచిపో యినారు. నాటుగు వేల గ్రామాలను విముక్తి పథంలో నడిపంచారు. దొరా భూప్వామ్యుల భూములను పేదలకు పంచారు. తెలంగాణ మంతటా ఎర్రజెండాలు ఎగురవేశారు. కులతత్వం, మత తత్వాలకు వ్యతిరేఖంగా రాజీఎరుగని పోరాటాన్ని నడిపిన మహోన్నత నాయకుడు కామ్రేడీ మఖ్ధూం. మెదక్‌ జిల్లాలో మఖ్ధూం కోవల్‌ కిషన్‌తో కలిసి భూపోరాటాలు నిర్వమించారు. మెదక్‌ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంతో మఖ్థూం కివలేకిషమనేది మైలురాయి వంటిది. సింగరేణి కార్మిక హక్కుల సాధనలో ఎన్నో విజయాలు సాధించాడు. 68.000మంది కార్మికుల పర్మినెంట్‌ కోసం ఎన్నో ఉద్యమాలను చేపట్టి విజయాలు సాధించాడు. మెదక్‌ సింగరేణిలో ముఖ్ధుం కివలకిషనే , దావూరి శేషగిరి రావుల త్యాగాల చరిత్రను కథలు కథలుగా చెప్పుకుంటారు. ఉద్యమకుసుమలు 1941లో హైదరాబాద్‌ ఉర్ధూ అభ్యుదయ చరిత్రల సంఘంను స్థాపించాడు. 1944లో అఖిల భారత అభ్యుదయ రచయితల నియమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసి ప్రధానకార్యదర్శిగా ఎన్నికైనాడు. మహామేధావి, రాజకీయ విశ్లేషకుడు, అంతర్జాతీయ ఉర్ధూకవి షాయిర్‌, ఇంక్విలాయ్‌, అభ్యుదయ కవి, విప్లవ రచయిత బిరుదాం కితుడు గొప్ప నాటకకరత, ప్రజాగాయకుడు , నటుడు ఇతని గజతేలు పాఠాంశాల్లోను, సినిమాల్లోను ఉపయోగించారు. ఫిర్‌ చిఢి బాత ్‌బాత్‌ పూలోంకి అనే గజలే గేయం సుప్రసిద్ధి. 1944లో సుర్ఖ్‌ సవేరా అరుణీయుల 1961లో గుల్‌ఎతర్‌ , 1966లో బిసాతరక్స్‌ (నాట్యవేదిక)పేరిట మూడు కవితా నిపుటాలను రచించాడు. 1944-51లో తెలంగాణ అనే కవిత రచించాడు. హుజూర్‌నగర్‌ నుంచి శాసనమండలి సభ్యులుగా ఎన్నికైనాడు. ఫాసిజానికి వ్యతిరేఖంగా సమసమాజస్థాపనక ివీరోచితంగా పోరాడాడు. ముఖ్ధాం అభ్యుదయ భావాలతో పీడిత లూడిత ప్రజల పక్షాన నిలిచి, కలం మేధుడిగా కమ్యూనిస్టు కార్మిక నాయకుడిగా తెలంగాణ సాయుధపోరాట మేధావిగా ,కష్టజీవులకు తన జీవితాన్ని అంకితం చేసి అమరుడైనాడు. 25-08-1969 తేదీన క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతూనే తుదిశ్వాస విడిచాడు. భౌతికంగా మఖ్ధూం మన మధ్య లేకున్న ఆయన ఆశయాలు మిగిలిపోయినవి. ప్రజలగుండెల్లో గూడు ట్టుకుని చెరగని ముద్రవేసు కున్నాడు. మఖ్ధూం పేరిట హిమాయత్‌ నగర్‌లో సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం పేరిట కొనసాగుతుంది. మెదక్‌ సింగరేణిలో ప్రజలు తమకు పుట్టిన కొడుకులకు, బిడ్డలకు మఖ్ధూం పేరు పెట్టి పిటుచుకుంటారు. వ్రమ జీవులకోసం కడదాక పోరుసల్పిన వీర వీరయోధుడు, నైజాం దోపిడికి వ్యతికంగా ఉంటారు. త్రెలంగాన సాయుధపోరా టాల్లోముఖ్ధూంది కీలక పాత్ర, భాóవితరాలకు సూర్ఫిదాయకం, కమ్యూనిస్టుల ఐక్యతే ముఖ్ధూంకు అసలైన నివాలి.

-దామెర్లపల్లి నర్సింహారెడ్డి