థ్యాంక్స్ టు సచిన్
హరారే ,జూలై 25 తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు సంబంధించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు కృతజ్ఞతలు చెప్పాలని తెలుగుతేజం అంబటి రాయుడు అన్నాడు. క్లిష్ట కాలంలో సచిన్ ఇచ్చిన స్ఫూర్తిని ఎప్పటికీ మరువలేనని చెప్పాడు. జాతీయ జట్టులో చోటు కోసం సుధీర్ఘ నిరీక్షణలో సహనం కోల్పోకుండా ఉండేందుకు మాస్టర్ స్ఫూర్తిగా నిలిచాడని తెలిపాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించడం ద్వారా సచిన్‌తో కలిసి ఆడే అవకాశం దక్కడం జీవితంలో మరపురాని అనుభూతిగా వర్ణించాడు. నీలో సత్తా ఉంది , వేచి చూడు తప్పకుండా అవకాశం వస్తుందన్న సచిన్ మాటలు నిజమయ్యాయని వివరించాడు. అలాగే మాజీ క్రికెటర్ రాబిన్‌సింగ్ కూడా ఎంతగానో ప్రోత్సహించారని తెలిపాడు. తన కుటుంబసభ్యుల సహకారం , స్నేహితుల సపోర్ట్ , ముంబై ఇండియన్స్ సహాయక సిబ్బంది కూడా మరువలేనని చెప్పాడు. ఈ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లలోనూ రాణించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు.