హోటల్‌ గదిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది

ఖైరతాబాద్‌: లక్డీకపూల్‌లోని హిల్‌ పార్క్‌ హోటల్‌ గదిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, హోటల్‌ యజమానుల కథనం ప్రకారం ఓ యువతి నగరంలో ఇంటర్వ్యూ కోసం వచ్చినట్లు హోటల్‌ సిబ్బందికి చెప్పి గది తీసుకుంది. ఆదివారం రాత్రి నుంచి ఉదయం వరకు ఆమె ఉన్న గది తలుపు తెరవకపోవడంతో హోటల్‌ సిబ్బంది యాజమాన్యానికి సమాచారం అందించారు. పోలీసులు గది తలుపు తెరిచి చూడగా యువతి ఉరివేసుకుని ఉంది. మృతురాలుని హయత్‌నగర్‌ ప్రాంతంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన పల్లవిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.