ప్రత్యేక రాష్ట్ర గొంతుక : జనంసాక్షి

సీమాంధ్ర పెత్తందారులు నడిపే పత్రికలు తెలంగాణ ఉద్యమానికి కనీసం చోటు కల్పించని పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింప జేసేందుకు ఆవిర్భవిచింది ‘జనంసాక్షి’. సరిగ్గా రెండేళ్ల క్రితం 2011 ఆగస్టు 15న పురుడుపోసుకున్న జనంసాక్షి, ఉద్యమాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు సాక్షాత్కరింపజేసింది. తెలంగాణ సాధన ఉద్యమాన్ని ప్రజల ముందుంచడమే కాదు స్వయంగా ఉద్యమంలోనూ పాలు పంచుకుంది. సాగరహారానికి మద్దతుగా నడిచింది. జీవ వైవిధ్య సదస్సులో తెలంగాణ మీడియా ప్రతినిధులపై వివక్షను గొంతెత్తి ప్రశ్నించింది. తన ప్రతి పక్షం ఉద్యమమే అయింది. ప్రతి చర్య ఉద్యమానికి ఊతమిచ్చింది. వలస పాలనను ప్రశ్నించింది. తెలంగాణ