ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వరంగల్,(జనంసాక్షి): ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థిని రమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. విద్యార్థిని ఆరో తరగతి చదువుతుంది.