సీమాంధ్రులది భాగస్వామ్యమే.. వాటా ఎక్కడిది?

హైదరాబాద్‌లో ర్యాలీ తీస్తే అదేరోజు
టీఎన్‌జీవోల ఊరేగింపు
విభజనకు సహకరించండి : దేవీప్రసాద్‌
హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ అభివృద్ధిలో సీమాంధ్రులతోపాటు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన ప్రజలు, వ్యాపారుల భాగస్వామ్యం ఉందని, అయితే వాటా మాత్రం లేనేలేదని టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు దేవిప్రసాద్‌ తేల్చిచెప్పారు. టీఎన్జీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడి యాతో మాట్లాడారు. ఇప్పటికైనా అన్నదమ్ముల్లా విడిపో దాం – ఆత్మీయుల్లా కలిసి ఉందామన్నారు. విభజన మా త్రం అనివార్యమన్నారు. ఇంతదూరం  వచ్చాక అడ్డుకోవాలని చూస్తే తామేం చేతగాని చవటలం కాదన్నారు. తమకుండే పంతా తమకుందని ఏవిధంగా అమలు చేయించుకోవాలో కూడా తెలుసన్నారు. తాము సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన ఇంకో రకంగా భావించి పెత్తనం చలాయించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. నిన్నటివరకు హైదరాబాద్‌ మనందరిది అన్న సీమాంద్రులు నేటినుంచి మాది అంటూ స్వరం మార్చారని ఆరోపించారు. 40 ఏళ్లక్రితం కొద్దొగొప్పో పెట్టుబడులతో, ఆస్తులతో హైదరాబాద్‌ వస్తే వచ్చి ఉండవచ్చు, పెట్టుబడులు పెడితే పెట్టి ఉండవచ్చని అయినంత మాత్రాన తమకే చెందాలనుకోవడం హేయమైన చర్యే అవుతుందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన ప్రతి వ్యక్తి డాటాను సర్వీస్‌ పర్టికులర్స్‌, పదోన్నతులు అన్ని వివరాలను సేకరిస్తున్నామని త్వరలోనే ప్రభుత్వానికి కేంద్రానికి సమర్పిస్తామన్నారు. ఉద్యోగులు కానివారిని తీసుకువచ్చి ఆందోళనలు చేస్తూ చిచ్చు పెట్టేందుకు సీమాంద్ర ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇరిగేషన్‌ శాఖలో అసలు సీమాంద్రులు లేనేలేరని బయటి వారిని తీసుకువచ్చి తెలంగాణా ఉద్యోగులపైకి రెచ్చగొట్టేలా చర్యలు తీసుకున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించాలని దేవిప్రసాద్‌ పిలుపునిచ్చారు. అనుకోని పరిస్థితులు ఏర్పడితే మాత్రం తిరగబడడం ఖాయమన్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడినా, దాడులకు పాల్పడినా కూడా ప్రతిగా స్పందించక తప్పదని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తే, టీఎన్‌జీవోల ఆధ్వర్యంలో అంతకన్నా భారీ ఊరేగింపు నిర్వహించి తమ సత్తా ఏంటో చాటిచెప్తామన్నారు.మిటీకి ఏకే ఆంటోని నేతృత్వం వహిస్తారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌, వీరప్పమొయిలీ, అహ్మద్‌ పటేల్‌ సభ్యులుగా ఉంటారు.