ఊరువాడ ఒక్కటై సార్‌కు జై కొట్టిన తెలంగాణ


జయశంకర్‌ మాటే మా బాట  – కోదండరామ్‌
సార్‌ తెలంగాణకే జాతిపిత : కేసీఆర్‌
హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి) :
తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌కు పది జిల్లాల ప్రజలు జై కొట్టారు. ఆయన 79వ జయంతి సందర్భం గా విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరు సలిపిన మహామనీషి స్ఫూర్తి తెలంగాణను పునర్నిర్మించుకుంటామని ప్రతిన బూనారు. సార్‌ జయంతిని పురస్కరించుకుని టీిఆర్‌ఎస్‌, టీ జేఏసీలతో పాటు వివిధ సంఘాలు వేడుకల ను వాడవాడలా నిర్వహించాయి. తెలంగాణను సాధించుకున్న సమయంలో సారు లేనందుకు బాధగా ఉందని పలువురు ఈ సందర్భంగా కంటతడి కూడా పెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్‌, కేకే, ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు, వివేక్‌, జూపల్లి కృష్ణారావు తదితరులు సారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్‌ పేదమహిళలకు చీరలు అందించారు. ఈసందర్భంగా జయశంకర్‌ ఆశయాలను నేతలంతా నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, సార్‌ తెలంగాణకే జాతిపిత అని అన్నారు. తెలంగాణ సాధన దిశగా ప్రజలందరినీ ముందుకు నడిపిన గొప్పమనిషి అని కొనియాడారు. ఆయన సూచించిన మార్గంలో తెలంగాణవాదులంతా పయనించి సారు కలలు కన్న సామాజిక, సిరులు ఒలికించే తెలంగాణను నిర్మించేందుకు కట్టుబడి ఉందామని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ అంటే జయశంకర్‌, జయశంకర్‌ అంటే తెలంగాణ అనేలా రాబోయే కాలంలో ప్రచారం నిర్వహించాలని జేఏసీ నేతలు సూచించారు. హైదరాబాద్‌ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద టీ-జేఏసీ ఆధ్వర్యంలో జయం త్యుత్సవాలు నిర్వహించారు. జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జేఏసీ చైర్మన్‌ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌, టీఆర్‌ఎస్‌ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ప్రొపె ˜సర్‌ జయశంకర్‌ చూపిన మార్గంలోనే నడుస్తామని తెలిపారు. తెలంగాణను అడ్డుకొనేందుకు జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనించాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు సమాయాత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సీమాంద్రలో జరుగుతున్న ఉద్యమం రాజకీయ నేతల ప్రోత్సాహంతోనే సాగుతోందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ చూపిన మార్గంలోనే నడుస్తామని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండారం తెలిపారు. జయశంకర్‌ చూపిన మార్గంలోనే తెలంగాణ సాధించామన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లాలో జరిగిన జయశంకర్‌ జయంత్యుత్సవాల్లో కోదండరాం పాల్గొన్నారు. జయశంకర్‌ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మున్ముందు కూడా జయశంకర్‌ బాటలోనే నడుస్తామన్నారు. ఇప్పుడు వచ్చింది కేవలం ప్రకటన మాత్రమేనని.. పార్లమెంట్‌లో ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందే వరకూ అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే ఢిల్లీ వెళ్లి అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు చెబుతామని తెలిపారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం కృత్రిమ ఉద్యమమని, రాజకీయ నేతలు స్వార్థం కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఆంధ్ర పాలకుల కుట్రలను తిప్పికొట్టేందుకు తెలంగాణవాదులంతా సమాయాత్తం కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని టవర్‌ సర్కిల్‌లో గల సారు విగ్రహానికి ఎమ్మెల్యేతో పాటు తెలంగాణవాదులు, జెఎసి ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా వ్యాప్తంగా గల్లీ నుంచి మొదలుకుని పట్టణాల వరకు తెలంగాణా వాదులు జయశంకర్‌సార్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాలా చోట్ల వృద్దులు, వికలాంగుల ఆశ్రమాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు పాలుపండ్లు పంపిణీ చేసారు. జయశంకర్‌ సారును నిద్రలో కూడా మరిచిపోమని  ప్రతిఒక్కరు పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబందాన్ని ప్రతిఒక్కరు నెమరు వేసుకున్నారు. జిల్లాలోని హుజురాబాద్‌, జమ్మికుంట, గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, జగిత్యాల, రామగుండం, సుల్తానాబాద్‌, ధర్మారం, వెల్గటూర్‌, కోరుట్ల, మెట్‌పల్లి, వేములవాడ, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, మానకొండూర్‌, బెజ్జంకి, ఇల్లంతకుంట, హుస్నాబాద్‌, గంగాదర, రామడుగు, చొప్పదండి తదితర మండలాల్లో, గ్రావిూణ ప్రాంతాల్లోసైతం సారుకు నివాళులర్పించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో టీిజెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు పదునైన చర్యలను రూపొందించేవారన్నారు. జీవితాంతం తెలంగాణా సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేశాని గుర్తు చేశారు. తెలంగాణా సమాజాన్ని చైతన్యం చేసిన వ్యక్తి జయశంకర్‌ సార్‌ అగ్రగామిగా ఉన్నాడన్నారు.  భుత్వాలు చొరవ తీసుకొని భద్రత కల్పించాలని, లేదంటే తామే తమ నేతను రక్షించుకుంటామన్నారు.