ఉద్యమం మళ్లీవస్తే ఆపడం తరంకాదు: ప్రొ. హరగోపాల్
వరంగల్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం మరోసారి గనుక వస్తే ఆపడం ఎవరితరం కాదని సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ కే. జయశంకర్ జయంతుత్సవాల్లో మాట్లాడారు. సీమాంధ్ర ఉద్యోగులు వాళ్ల సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను హరగోపాల్ సమర్థించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయలని సీమాంధ్ర పట్టుబట్టడం తగదని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా సీమాంధ్ర నేతలు రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన కోరారు.