కేసీఆర్ న్యాయకత్వంలోనే పనిచేస్తా: చందూలాల్
వరంగల్,(జనంసాక్షి): తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు చందూలాల్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. ఓ పనిపైనే ఢిల్లీ వెళ్లాను తప్ప కాంగ్రెస్ నేతలను కలవలేదని పేర్కొన్నారు.