వరంగల్ సెంట్రల్ జైల్లో రాజకీయ ఖైదీల భేటీ
వరంగల్,(జనంసాక్షి): ఈ రోజు వరంగల్ సెంట్రల్ జైల్లో రాజకీయ ఖైధీలు సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని, అర్హులైన ఖైదీలందరికి క్షమాభిక్ష పెట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ డిమాండ్ల సాధనకు ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఖైదీలు సామూహిక దీక్ష చేపట్టనున్నట్లు సమాచారం.