సీమాంధ్రులది ఉద్యమం కాదు ఉన్మాదం: కవిత
వరంగల్,(జనంసాక్షి): సీమాంధ్ర కృత్రిమ ఉద్యమంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చెరిగారు. సీమాంధ్రులు చేస్తున్నది ఉద్యమంకాదు, ఉన్మాదమని విమర్శించారు. దీన్ని సీమాంధ్ర పెట్టుబడిదారులు వెనుకుండి నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో చేసిన ఆందోళనలను సీమాంధ్ర కృత్రిమ ఉద్యమకారులు కాపీ కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి అన్నదమ్ముల్లా విడిపోవడానికి సీమాంధ్ర ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.