వరంగల్ జిల్లాలో దారి దోపిడీ
వరంగల్,(జనంసాక్షి): వరంగల్ జిల్లాలో దారి దోపిడీ జరిగింది. వర్దన్నపేట మండలం పున్నేల్ రెడ్ నుంచి ఐనవోలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 1.70 లక్షలు గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.