కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, వాటర్‌మెన్‌ను విధుల నుంచి తొలగించారు. ఆర్‌ఎంవోకు మెమో జారీ చేశారు.